జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానీపర్తి గ్రామంలో గల ఎల్లమ్మ తల్లి దేవాలయం చోరీ జరిగిన సంఘటన బుధవారం రోజున వెలుగులోకి వచ్చింది ఎస్సై జక్కుల పరమేష్ తెలెపిన వివరాల ప్రకారం గట్ల కనపర్తి లోని తాటివనం లో గల ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అదే గ్రామానికి చెందిన గోశాల మధుసూదన్ పూజారిగా పనిచేస్తున్నాడు మధుసూదన్ జనవరి నెల 28న దేవాలయానికి తాళం వేసి హైదరాబాద్లో తన సోదరుడు నూతన గృహప్రవేశానికి వెళ్ళాడు బుధవారం అమ్మవారికి పూజలు చేసేందుకు రోజు మాదిరిగానే ఉదయం గుడికి వచ్చాడు ఈ క్రమంలో దేవాలయం కి వేసిన తాళం లేకపోవడంతో పక్కనే ఉన్న ముంజల సదానందానికి తెలియజేశాడు ఇద్దరు కలిసి ఎల్లమ్మ తల్లి దేవాలయం లోపలికి వెళ్లి చూడగా అమ్మవారికి రెండు బంగారు పుస్తెలు వెండి కండ్లు వెండి ముక్కు పుడక కనిపించలేదు వాటి విలువ సుమారు 20వేల రూపాయలు ఉంటుందని గుర్తుతెలియని వ్యక్తులు అపరహరించారని స్థానిక పోలీస్ స్టేషన్లో మధుసూదన్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేష్ పేర్కొన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు….