
జనంన్యూస్. 07.నిజామాబాదు. రురల్ శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కవితది ఆత్మగౌరవ పోరాటం కాదు ఆస్తుల కోసం పోరాటం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడించారు. ధర్పల్లి,ఇందల్వాయి,సిరికొండ మండలాలకు చెందిన 200 మందికి కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని,పేదల,రైతుల సంక్షేమమే తమ ధ్యేయం అని అన్నారు.భారాస రాష్ట్రానికి చేసిందేం లేదని,రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని,రాహుల్ గాంధీని విమర్శిస్తే బట్టలిప్పి కొడతామని,కవితది ఆత్మగౌరవ పోరాటం కాదని,ఆస్తుల కోసం పోరాటం అని అన్నారు.ఉద్యమకారుల కుటుంబాలను రోడ్ల మీదికి తెచ్చిన ఘనత కేసీఆర్ కుటుంబానిదే అని అన్నారు.కేంద్రం అన్నింటిని అమ్మేస్తుందని,ఎంపీ కనీసం గ్రామాల ముఖం కూడా చూడడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,మూడు మండలాల నాయకులు,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
