
జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
150 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారత్
ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు.మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఇది భారత వ్యవసాయ రంగం సాధించిన చారిత్రక విజయంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకప్పుడు ఆహార కొరతతో ఇబ్బంది పడిన భారత్, నేడు ప్రపంచ దేశాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని చౌహాన్ వ్యాఖ్యానించారు.