
జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం, దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 54 మంది రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రేబిస్ మరణాల్లో దాదాపు 36 శాతం భారత్‌లోనే జరగడం అత్యంత కలవరపెట్టే విషయం. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం రేబిస్‌ను ‘నోటిఫైడ్ వ్యాధి’గా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.జాగ్రత్తలు కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యంత కీలకమైనవి. చాలామంది కుక్క కాటు చిన్న గాయమేనని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అదే ప్రాణాంతక రేబిస్‌కు దారితీయవచ్చు. కుక్క కరిచిన వెంటనే గాయమైన ప్రదేశాన్ని సబ్బుతో, ప్రవహించే నీటి కింద కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఇలా చేయడం ద్వారా వైరస్‌ను గాయ ప్రాంతం నుంచి చాలా వరకు తొలగించే అవకాశం ఉంటుంది.గాయాన్ని కడిగిన తర్వాత ఆల్కహాల్ లేదా పోవిడోన్-అయోడిన్ వంటి యాంటిసెప్టిక్ ద్రావణాలు రాయాలి. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇంట్లో చేసే ప్రాథమిక చికిత్సతోనే సరిపెట్టుకోకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. కుక్క కాటు జరిగిన 24 గంటల్లోపు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరం. ఆలస్యం అయితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి