
మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించారు
మహిళలతోనే రాష్ట్రము గ్రామాల అభివృద్ధి
ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్
జనం న్యూస్ జనవరి 7 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఇందిరానగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలను గ్రామ సర్పంచి అంబాల రాజు శాలువలతో సన్మానించారు.ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సాతూరి ప్రవళిక, గంగారపు రవళి, కడారి నవ్యశ్రీ, కడారి నవ్య, దాసరపు మరియాలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని మహిళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచి అంబాల రాజుతో పాటు ఉప సర్పంచి కోరే లావణ్య, వార్డు సభ్యులు కడారి సుధాకర్, నక్క రాకేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి గబ్బేట స్వామి, వివో అధ్యక్షురాలు గొర్రె శ్రీలత, విఓఏ తాడూరి సుమలత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు