
జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని వియజనగరం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ డి. మణికుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 150 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వాహన చోదకులు స్పష్టమైన దృష్టితో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని ఆయన సూచించారు.