
జనం న్యూస్ జనవరి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
హన్మకొండ జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని తహరాపూర్ గ్రామంలో ఉచిత పశు గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన ప్రారంభించారు ఈ శిబిరాన్ని స్థానిక మండల పశువైద్యధికారి డాక్టర్ పి.సునీల్ మాట్లాడుతూ రైతులు గోపాలమిత్రుల సేవలు వినియోగం చేసుకోవాలని ,పశువులు ఎద కు వచ్చినపుడు కృత్రిమ గర్భధారణ చేయించాలని, పశుగ్రాసలు సాగు చేసుకోవాలని, దూడలకు నట్టల నివారణ మందులను త్రాగించుకోవాలని, గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరం లను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం లో ఉప్పసర్పంచ్ శ్రీనివాస్, పశు వైద్య సిబ్బంది రవీందర్ రెడ్డి, రమేష్ బాబు, గోపాలమిత్ర సూపర్ వైజర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, గోపాలమిత్రులు సతీష్,సుదర్శన్, కుమార్ ప్రజ్వల్ ప్రతినిధి అమరేందర్ రెడ్డి పాడి రైతులు పాల్గొన్నారు….