
చిన్న విషయానికే కార్యాలయంలో గందరగోళం.. ఉద్యోగిని దాడి!
తీవ్రంగా ఖండించిన యూనియన్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఎఫ్ ఎస్ సి ఎస్ ) కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సంఘం కార్యదర్శి పై ఓ రైతు దౌర్జన్యానికి పాల్పడటం కలకాలం రేపింది కార్యాలయానికి వచ్చిన సదరు రైతు చిన్న విషయాన్ని వాగ్వాదానికి దిగి కార్యదర్శిని నానా దుర్భాషలాడుతూ చేతులు చేసుకోవడం దాడి చేయడం జరిగింది విషయం తెలిసినా వెంటనే బిచ్కుంద లోని కార్యదర్శిలంతా సంఘం కార్యాలయానికి చేరుకున్నారు బాధ్యత కార్యదర్శి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై ఇలా దాడి చేయడం సరికాదని దుర్భాషలాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు జిల్లాలోని ఏ సంఘంలో నైనా కార్యదర్శులపై గాని రైతులు లేదా ఇతర వ్యక్తులు దౌర్జన్యం చేస్తే సహకరించేది లేదని యూనియన్ నాయకులు హెచ్చరించారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వరకు పోరాడుతామని స్పష్టంగా చెప్పారు అనంతరం బాధ్యుడి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
