
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు(జనవరి 09)
సుభాష్ యూత్ వారు నిర్వహించిన బీసీ కాలనీ ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (BPL-3) లో భాగంగా మింటు 11 జట్టు మరియు స్కై వారియర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో మింటు 11 జట్టు ఘన విజయం సాధించింది.ఈ సందర్భంగా విజేత జట్టుకు మొదటి బహుమతిగా నగదు దాత రూ.15,000/-ను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుష్మిత మహేందర్ గౌడ్, సాంబు రాము, సుభాష్ యూత్ సభ్యులు మరియు బీసీ కాలనీ యువకులు పాల్గొన్నారు.