
జనం న్యూస్ జనవరి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లోని పలు పాఠశాలలను మండల విద్యాధికారి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈరోజు ఎంపీపీ ఎస్ బట్టు తండా పాఠశాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలను పరీక్షించడం తోపాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది.ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అక్షరాభ్యాసంలో నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ లతో కలిసి పాల్గొనడం జరిగింది. పాఠశాల సిబ్బంది నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజా ప్రతినిధులను ఆత్మీయంగా సన్మానించడంతో పాటు పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బట్టు తండా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానిక పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు