
జనం న్యూస్ 9డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్ :హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ స్మారక క్రీడా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలను స్థానిక సర్పంచ్ కనక ప్రతిభతో కలిసి జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవీందర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, క్రీడలను స్నేహపూర్వకంగా ఆడి గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు ప్రదర్శించాలని సూచించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను బయట ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పటేల్ ఆత్రం భగవంత్, దేవారి కనక కొద్దు, పాఠశాల ఉపాధ్యాయులు రాంచందర్, పీడీ చొక్కారావ్, కనక వెంకటేశ్వర్ రావ్, ఆత్రం ధర్మరావ్, తనాజీ, భుజంగ్, గణపత్, గ్రామస్తులు సోయం రాజు, భరత్, జూగాది రావ్, పుల్లబాయి పాల్గొన్నారు. అలాగే హైమన్ డార్ఫ్ యూత్ సభ్యులు తరుణ్, నాగోరావ్, సుదర్శన్ మాదోవ్, ఉపాధ్యాయులు కనక సోనేరావ్, అర్కా మోతిరామ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఆనంద్, మరు భీము తదితరులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.