
బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో కళాశాల ప్రిన్సిపల్ కె అశోక్ గారి ఆదేశానుసారం శుక్రవారం సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని సంక్రాంతి పండగ గొప్పతనం తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాలను రంగవల్లుల ద్వారా తెలిపారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ పద్మ మేడం(AAO ) గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన న్యాయనిర్నేతలు మొదటి ,ద్వితీయ, తృతీయ, విజేతలను ప్రకటించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ టి. హన్మండ్లు గారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకత ,సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ .జి .వెంకటేశం , ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి. రమేష్ బాబు
మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త వై. రేవతిగారు ,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

