
మాట నిలబెట్టుకున్న నూతన పాలకవర్గం.
జనం న్యూస్ 09జనవరి పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మేకల అంజమ్మ - మల్లయ్య, ఉపసర్పంచ్ గోలి సంజీవరెడ్డి, వార్డ్ మెంబర్స్ నల్లల చందు, జితేందర్ గౌడ్, ఎండి రజాక్, తడగొండ రాజు, తడగొండ సాగర్, పలుమారు రమ- గంగాధర్, ద్యావ వెంకట్ రెడ్డి, కూన. కుమార్, గౌడ్ నవీన్, గ్రామపంచాయతీ కార్యదర్శి మంజుల, ఆధ్వర్యంలో 6 వార్డులో నీటి సమస్యకు పరిష్కారం చేయడం జరిగినది. ఆరో వార్డులో ఉన్న బోరులో కొత్త మోటర్ దించడం జరిగినది. ఈ మోటారుకు పది కలెక్షన్లు ఇవ్వడం జరిగినది ఇలా చేయడం ద్వారా కొంత నీటి సమస్యను తగ్గించగలిగినాము. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ సిబ్బంది హోలీ పాషా, కుమార్, మహేష్, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
