
సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అమలాపురం..
జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి
హర్షం వ్యక్తం చేసిన జనసేన నాయకులు..
అమలాపురం మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అమలాపురాన్ని అభివృద్ధి పరంగా కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లాలన్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆకాంక్షకు ఇది తొలి అడుగుగా నాయకులు అభిప్రాయపడ్డారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడం పట్ల ఎమ్మెల్యే ఆనందరావు పాత్ర అభినందనీయమని పేర్కొంటూ నియోజకవర్గ ప్రజలు, నాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా అమలాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శుభగృహ హోటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావుకు నాయకులు అభినందనలు తెలిపారు.కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని నాయకులు తెలిపారు. అందులో భాగంగా అమలాపురం అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆనందరావు నిరంతరం కృషి చేస్తూ, మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌కు చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.ఇప్పటికే ఇచ్చిన హామీలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావును ఈ సందర్భంగా జనసేన నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లా శ్రీధర్, కంచిపల్లి అబ్బులు, కల్వకొలను తాతాజీ, ఆర్డీఎస్ ప్రసాద్, సూదా వెంకటేష్ (చిన్నా), మహాదశ నాగేశ్వరరావు, పిండి రాజా, మోటూరి కిరణ్, గంగాబత్తుల కిషోర్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
