
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్
జనవరి 10మండపేట నియోజకవర్గం రాయవరంలో పట్టాదారుపాసుపుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎంపీ హరీష్ మధుర్, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర కార్పొరేషన్ చైర్మెన్ లు పాల్గొన్నారు.