
ప్రిన్సిపాల్ రవికుమార్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు
జనం న్యూస్- జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓ వైపు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కళాకారుల వేషధారణలతో విద్యార్థులు సందడి చేశారు. పట్టు పరికిణీలలో చిన్నారులు, భోగి మంటలతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి శోభ నిండుకుంది. రంగవల్లులు తీర్చిదిద్ది చిన్నారులు కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. రకరకాల పిండి వంటల ప్రదర్శన, హరిదాసుల విన్యాసాలు అచ్చమైన తెలంగాణ సాంప్రదాయాలతో చిన్నారులు అలరించారు. సంక్రాంతి సమయంలో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించి సంతోషంగా ఉంటారని అందుకే ఈ పండుగను ప్రతి ఇంటింటా ఘనంగా జరుపుకుంటారని ఉపాధ్యాయులు వివరించారు.మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. చిన్నాపెద్దా అంతా కలిసి రంగవల్లులు, పిండివంటలు, ఆటపాటలతో సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని నిర్వహిస్తారు. చాలామంది సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ అనే అనుకుంటారు. ఆ మూడు రోజులపాటే సంబరాలు జరుపుకొంటారు ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరందుకున్నాయి. నాటి సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చిన్నారులకు భోగి వేడుక, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థులకు పండుగ విశిష్టత తెలియాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని ఇందులో భాగంగా స్థానిక నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులతో బోగిమంటలు, రంగ వల్లులు వేసి వేడుకలు జరుపుకున్నరు. భవష్యత తరాల వారికి మన సాంప్రదాయాలు, కట్టుబాటులు, పండుగలు గుర్తుఉండేలా నిర్వహించడం ఆనం దంగా ఉందన్నారు. ముందస్తు సంక్రాంతి పండుగ వైభ వంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏటిపి సంతోష్ మరో ఏటిపి సరిత ఇతర ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు