
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ .
జుక్కల్ జనవరి 11 జనం న్యూస్
కామారెడ్డి:జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఏలే మల్లికార్జున్ కలిసి ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ని శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఎమ్మెల్యే గారు, డీసీసీ అధ్యక్షులుచే అందిన ఈ ఆత్మీయ సత్కారానికి స్పందించిన ఎస్పీ గారు, జిల్లా శాంతి భద్రతలు, ప్రజల రక్షణకు పోలీస్ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు.జిల్లా అభివృద్ధి శాంతియుత వాతావరణంలోనే సాధ్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని సూచించారు.అలాగే డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే కాంగ్రెస్ పార్టీ ప్రథమ లక్ష్యమని, పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.