
చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు.
మద్నూర్ జనవరి 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలో వివిధ గ్రామాలలో, గాలిపటాల దుకాణలో, మద్నూర్ ఎస్సై రాజు , చైనా మాంజా పై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ . నిషాదిత, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు గాలిపటాల దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులు ఎవరు కూడా నిషేదిత చైనా మాంజను విక్రయించకూడదని హెచ్చరించారు. నిబంధనలు అధికమించి విక్రయాలు జరిపితే వారిపై చట్టరీత కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,