
జనం న్యూస్ జనవరి 10,
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలకేంద్రంలో ఉన్న జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి) ఆధ్వర్యంలో పాలసీల కమిటేషన్ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన ఎల్ఐసి ఏజెంట్లకు ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శనివారం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో వాల్గోటు పురుషోత్తం, కట్కం వెంటరత్నం, మేకల తుకారాం, శ్రీరాముల నారాయణ స్వామి, వెల్ది గంగయ్య,రాజారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ, ఎల్ఐసి సంస్థ అందిస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు తమకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. తమను నిరంతరం ప్రోత్సహిస్తున్న , సీనియర్ డివిజనల్ మేనేజర్,సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
