
జనం న్యూస్ 11జనవరి పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళపేట గ్రామములో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత మేఘ పశు వైద్య శిబిరాన్ని ఏం సి చైర్మన్ బుర్ర రాములు గౌడ్, గ్రామ సర్పంచ్ మోకిన పెళ్లిగోపాల్ పశు వైద్య అధికారి డాక్టర్ హేమలత తో కలిసి ప్రారంభించారు. అనంతరం పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ మాట్లాడుతూరేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పశువులకు అన్ని రకాల చికిత్సలు చేయడానికి మేఘ పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని విధాల చికిత్సలను ఉచితంగా అందిస్తుందన్నారు.ఇట్టి చికిత్సలకు అవసరమైన మందులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో మండలంలోని పశువులన్నిటికీ సరిపడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాబోవు వారం రోజుల్లో మండలంలోని మిగతా క్లస్టర్లలో జిల్లా పశు వైద్య సూపర్వైజర్ నరసయ్య పెగడపల్లి పశు వైద్య అధికారి హేమలత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తారని ఇట్టి పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కడారి సుప్రియ తిరుపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెట్ల కిషన్ ఉప సర్పంచ్ కుంచ రాజేందర్ వార్డ్ సభ్యులు గంగాధర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడుఅశోక్ సి సి బి సి మల్లయ్య ,జిల్లా సూపర్వైజర్ నరసయ్య సిబ్బంది వి ఏ మతిన్, ఓఎస్ వినీత్,గోపాల మిత్రులు తిరుపతి, జానీ పాషా, శంకరయ్య, వంశి,పశు రైతులు పాల్గొన్నారు.