
జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల భద్రత, మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రతా విభాగం ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా, రాబోయే 10 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను (SHOs) ఆదేశించారు. పండుగ రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ జామ్స్ పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ ఫ్లోను నిరంతరం పర్యవేక్షించాలని ఈ పండుగ సీజన్లో కేవలం జరిమానాలు విధించడంపైనే కాకుండా, ప్రయాణికులను రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలని ఎస్పీ స్పష్టం చేశారు. అతివేగం, అజాగ్రత్త వల్ల కలిగే ప్రమాదాల గురించి వాహనదారులకు సున్నితంగా వివరించాలని.ట్రాఫిక్ విధుల్లో ఉండే సిబ్బంది వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలని. ఎన్ఫోర్స్మెంట్ సాధారణ పద్ధతిలో సాగాలి తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టేలా దూకుడుగా ఉండకూడదు అన్నారు.టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితిని సీనియర్ పోలీస్ అధికారులు నిరంతరం గమనిస్తుంటారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించి పరిష్కరించాలి. ప్రయాణికులకు సూచనలు: మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని, సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుని పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరుతోంది.ప్రజలందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే మా ప్రధమ కర్తవ్యం. జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.