
జనం న్యూస్ జనవరి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ సతీష్ బాబు హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బె ల్ట్ ధరించి ప్రమాదాలు జరగకుండా విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు పలు వాహనాల పై ప్రయాణం చేసే క్రమంలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యకూడదని సూచించారు అలాగే వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ వాహనంకు సంబంధించిన పేపర్లు తప్పనిసరి ఉండాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని తెలిపారు ఇలాంటి నిబంధనలను పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శాయంపేట సీ ఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు….
