జనం న్యూస్ కోటగిరి 10 జనవరి నిజామాబాద్ జిల్లా భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పాతకాలం నాటి సంక్రాంతి వేడుకల వస్తువులను ఆయన పరిశీలించారు హరిదాసులు గంగిరెద్దులు సంక్రాంతి పిండి వంటలు పండగ విశిష్టతను తెలియజేసేలా ఉన్నాయని ఆయన అన్నారు పంటలు చేతికి వచ్చే పండగ సంక్రాంతి అని కొనియాడారు పంట పొలాలలో ఏర్పాటుచేసే మంచెలు బావులు ఎడ్ల బండ్లు పతంగులుపాత రోజులను గుర్తుచేసేలా ఉన్నాయని ఆయన అన్నారు అనంతరం భోగిమంటలను వేసి చిన్నారులకు భోగి పళ్ళను పోశారు పాఠశాలల్లో పండగల విశిష్టతను తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పండగల విశిష్టత తెలియడంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని ఎంఈఓ అన్నారు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు ఎంఈఓ శ్రీనివాసరావును పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్ కరస్పాండెంట్ తెల్ల అక్షర ఉపాధ్యాయ బృందం నిర్మల రేష్మ చంద్రకళ నందిని షామిలి సంధ్య నఫీజ్ ఆరతి సునీత రమ్య శిరీష శ్రీలత సంగీత సావిత్రి ప్రవళిక సాయి పవన్ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు