
జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ పర్యవేక్షణలో మరియు అచ్యుతాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ కి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అచ్యుతాపురం పోలీసులు దుప్పుటూరు గ్రామ పరిధిలో పేకాట శిబిరంపై మెరుపు దాడి నిర్వహించారు. దుప్పుటూరు ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుంపులుగా చేరి జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ ఆదేశాలతో, ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్.ఐ లు సుధాకర రావు, వెంకటరావు మరియు పోలీస్ సిబ్బంది కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.53,620/- నగదును మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో చట్టపరమైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, జూదం లేదా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.//