
జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయ సాధనం కోసం నిరంతరం యువత కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవడం ద్వారా చక్కని భవిష్యత్తు సంస్కారం, విజ్ఞత, వివేకం, ఆదర్శంగా అలవాటు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. అక్కడ పాల్గొన్న వారిని ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువత గమ్యం చేరేవరకు వెనక్కి తిరిగి రాకూడదని స్వామీ వివేకానంద చెప్పిన మాటలను యువత పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ఈరోజు ఉదయం గొల్ల వీధిలో అడ్వకేట్ సాయి ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలు వేసి ఘనమైన నివాళులర్పించి పేదలకు నాగ జగదీష్ చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ పి నాగ టీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.//