
అధికారం మాదే, నిర్ణయం మాదే, అంటున్న స్థానిక సర్పంచ్,
జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని
రామతీర్థ గ్రామానికి చెందిన నార్కుల గంగారామ్,గ్రామంలో నీటి సరఫరా విధులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పార్టీ విభేదాలతో కక్షపూరితంగానే గ్రామసభలో తీర్మానించి విధుల నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానించడం జరిగిందని అన్నారు. గ్రామంలో తనపై ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ ఇస్తాను సారంగా తొలగించడం సరికాదని అన్నారు.ఈ సందర్భంగా నార్కుల గంగారామ్,సోమవారం ఎంపీడీవో సత్తయ్యను వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం రెండు గుంటల భూమి దానం దానం చేయడం జరిగిందని అన్నారు. పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న తనను నూతన పాలకవర్గం తొలగించినట్లు తీర్మానం చేశారని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.తనకు న్యాయం చేకూరే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కంగ్టి సర్పంచ్ కృష్ణ, గ్రామస్తులు గంగారం పాటిల్,తదితరులు పాల్గొన్నారు.