
జనం న్యూస్ 12 జనవరి 2026, వికారాబాద్ జిల్లా
పూడూరు మండలం మన్నెగూడలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందుతున్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రొసీడింగ్స్ అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించడం జరిగిందని,రాష్ట్రంలో 52.82 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి.పరిగి నియోజకవర్గంలో 43,276 మంది అర్హులుగా ఎంపికయ్యారు మరియు మొత్తం రూ.106 కోట్లు మాఫీ చేయబడ్డాయని తెలిపారు.ప్రజా పాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అందరికీ ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేయలేని వారికి కూడా గృహజ్యోతి పథకం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.