
జనం న్యూస్ 12 జనవరి, వికార బాద్ జిల్లా
పరిగి నియోజకవర్గంలోని ఘనంగా చౌడపూర్ మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జ్ఞానం, దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. యువతకు ఆయన ఒక అమూల్యమైన మార్గదర్శి. ఆయన జీవితం, సందేశాలు మనకు ఎప్పటికీ దీపస్తంభాల్లా మార్గనిర్దేశం చేస్తాయి. “లేచిరండి, మేల్కొనండి, లక్ష్యం సాధించే వరకు ఆగకండి.స్వామి వివేకానంద ఉద్బోధన యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, గొప్ప లక్ష్యాల సాధనకు ప్రేరణనిస్తుంది.ఈ రోజున మనం స్వామి వివేకానంద గారి ఆశయాలను మన జీవితాల్లో ఆచరిస్తూ, సమాజసేవలో భాగస్వాములవ్వాలి. విద్య, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.యువతే దేశ భవిష్యత్తు.మన ప్రతి మంచి ప్రయత్నం సమాజాన్ని మెరుగుపరచే బలమైన అడుగే.స్వామి వివేకానంద ఆలోచనలు, ఆదర్శాలు మనందరినీ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తూ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు మాట్లాడడం పాల్గొనడం జరిగింది.