
జనవరి 12 జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి
సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని మైకుడ్ గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. జనవరి 12, 1863న కలకత్తాలో జన్మించారు, చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా,రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి,ఆయన వేదాంత బోధనలను వ్యాప్తి చేశారు.భారతీయ సంస్కృతి,వేదాంతం, యోగాలను ప్రపంచానికి పరిచయం చేశారు.కేవలం పుస్తక పరిజ్ఞానం కాకుండా,వ్యక్తిత్వ వికాసం,ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ఆలోచనలే నిజమైన విద్య లక్ష్యమని బోధించారు.పేదలకు, నిరుపేదలకు సేవ చేయడమే భగవత్ సేవ అని నమ్మారు.యువతలో దేశభక్తి, ఆత్మగౌరవాన్ని పెంపొందించారు.స్వామి వివేకానంద జయంతి మాజీ సర్పంచ్ రేవప్ప కుమారుడు శివ ఆధ్వర్యంలో మనూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో జరిపారు.ఈ సందర్భంగా మాజీ సర్పచ్ రేవప్ప కుమారుడు శివ కుమార్ మాట్లాడుతూ…సమాజా జ్ఞాన సంపద యువతకు స్ఫూర్తి దాత స్వామి వివేకానంద అని, వివేనందుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణం కృష్ణ, వివేకానంద యువజన సంఘాల నాయకులు గాండ్ల సుధాకర్,శివరాజ్,సంగన్,విట్టల్ రెడ్డి,యం. చంద్రకాంత్,బీరప్ప,ప్రవీణ్ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.