
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 13
నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ గృహజ్యోతి వంటి పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప మాట్లాడుతూ దిడిగి గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
