
జనం న్యూస్ జనవరి 13, వికారాబాద్ జిల్లా,
పరిగి మునిసిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.అనంతరం నస్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా టాస్ వేస్తూ మ్యాచ్ ప్రారంభం చేశారు.కొద్దిసేపు ఎమ్మెల్యే బ్యాటింగ్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.