
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 రిపోర్టర్ సలికినీడి నాగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్
అఖిల భారతీయ కోలి ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్, అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు కీలా బాలకృష్ణ ముదిరాజ్, మరియు అఖిల భారతీయ కోలి ముదిరాజ్ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలి శివకుమార్ ముదిరాజ్,మరియు ఆంధ్రప్రదేశ్ బీ.సీ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులు కదిరేపల్లి రామాంజనేయులు 26-1-2026. నాడు విజయవాడలో జరగబోయే రాష్ట్ర మొదటి సమావేశానికి సంబంధించిన కార్యక్రమం యొక్క వివరాలను తెలియజేయడానికి చిలకలూరిపేటలో ముదిరాజ్ పెద్దల ఆహ్వానం మేరకు చిలకలూరిపేటలో పాటిమీద వున్నా ముదిరాజ్ కళ్యాణ మండపంలో గౌరవంగా కలవడం జరిగింది. చిలకలూరిపేట ముదిరాజ్ సంఘ పెద్దలు వారిని సాదరంగా ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి “దూడం రెడ్డి బాబు ముదిరాజ్ ని కిలా బాలకృష్ణ ముదిరాజ్ నీ శాలువాతో గౌరవప్రదంగా సత్కరించారు. చిలకలూరిపేట ముదిరాజు పెద్దలతో చర్చించిన అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్ మాట్లాడుతూ ఇంత గౌరవంగా ఆహ్వానించి తమని సత్కరించిన చిలకలూరిపేట ముదిరాజులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. చిలకలూరిపేట ముదిరాజులు అన్ని రంగాలలో మెరుగ్గా రాణించాలని ప్రతి ఒక్కరూ రాజకీయంగా కూడా ఎదగాలని ఆ ఎదుగుదలలో అఖిల భారతీయ కోలి ముదిరాజ్ సంఘం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చిలకలూరిపేట ముదిరాజులు ఐక్యమత్యంతో చైతన్యవంతంగా “ముదిరాజ్ కళ్యాణ మండపాన్ని”మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించుకోవడం ముదిరాజ్ జాతి మొత్తానికి గర్వకారణం అని మన రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కొనియాడారు. ముదిరాజ్ కల్యాణ మండపం నిర్మాణంలో కష్టపడి పనిచేసిన పెద్దలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు. కళ్యాణ మండపం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేశారు. చిలకలూరిపేటలో ఉన్న ముదిరాజులకు ఏ సమస్య వచ్చినా కూడా తాము ముందుండి పోరాడుతామని అవసరమైతే జాతీయస్థాయి ముదిరాజ్ నాయకులతో మాట్లాడి ముదిరాజ్ జాతి కోసం పనిచేసే విభాగాల సహాయంతో ఆ సమస్యను పరిష్కరించడానికి తమ వంతు బాధ్యతగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ముదిరాజుల జాతి యొక్క చిరకాల స్వప్నం బి.సి-డి నుంచి బీ.సీ-ఏ కి నెరవేరుతుందని వ్యక్తం చేశారు. అలా జరిగిన రోజు ముదిరాజ్ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో గోసంగి రామకృష్ణ ముదిరాజ్( పహిల్వాన్ రామకృష్ణ), అనుముల కోటేశ్వరరావు ముదిరాజ్ , కొండేబోయిన విశ్వనాథం ముదిరాజ్, మందలపు సాంబశివరావు ముదిరాజ్ , నక్క పోతురాజు ముదిరాజ్ , కనికుట్ల శ్రీనివాసరావు ముదిరాజ్ ,మేకల రాంబాబుముదిరాజ్, కొండేబోయిన నాగబాబు ముదిరాజ్ కొండే బోయిన వాసు ముదిరాజ్, శిరమా నాగరాజు ముదిరాజ్, కొమ్మనబోయిన దుర్గా ముదిరాజ్ మరియు వెంకట బుల్లోడు ముదిరాజ్ లు పాల్గొన్నారు.