
జనం న్యూస్ 13 జనవరి వికారాబాద్ జిల్లా
చౌడపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలను PCC సభ్యులు డా. టి. రితిక్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈర్లవాగు తండా, చౌడపూర్, వాల్య నాయక్ తండా,గోగ్య నాయక్ తాండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని రితిక్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను ఆనందంగా, ఆరోగ్యకరంగా జరుపుకోవాలంటే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్, సలీం, సంబంధిత గ్రామాల సర్పంచులు, నాయకులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.