
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 పల్నాడు జిల్లా ఇన్చార్జ్ సలికినీడి నాగు
నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో
ఈరోజు చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టే విధంగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.అదేవిధంగా, బొప్పూడి గ్రామానికి సంబంధించిన కొత్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తూ, భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.