
మద్యం తాగి వాహనాలు నడిపితే కటిన చైర్యలు…
ఏసీపి. పి.ప్రశాంత్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 13 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండల కేంద్రములో ఆటో డ్రైవర్లు వాహన దారులతో మంగళవారం రోజున మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన దారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని ఓవర్ లోడ్ త్రిభుల్ రైడింగ్ తో పాటు మద్యం తాగి వాహనాలు నడుపకూడదని ప్రజలు రోడ్డు దాటే క్రమములో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు డ్రైవర్లు, పాదచారులు మరియు ఇతర వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి రూపొందించబడ్డాయనీ అవి ట్రాఫిక్ ప్రవాహాన్ని నియంత్రించడానికి, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు రోడ్లపై గందరగోళాన్ని నివారించడానికి రూపొందించబడ్డాయి.అని దురదృష్టవశాత్తు, చాలా మంది ఈ నియమాలను విస్మరిస్తారనీ, దీనివల్ల అనవసరమైన ప్రమాదాలు, గాయాలు మరియు మరణాలు సంభవిస్తాయనీ వాటిని నివారించడానికి మద్యం మరియు వేగములను తగ్గించాలని అలాంటి వారిని ఉపేక్షించమని ఈ సందర్భంగా వాహన దారులతో అన్నారు ఈ కార్యక్రమంలోకాజీపేట ఎసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి తో పాటు సిఐ పులి రమేష్ ఎస్సై ప్రవీణ్ కుమార్ వాహన దారులు ప్రజలు పాల్గొన్నారు.