
జనం న్యూస్, జనవరి 14,అచ్యుతాపురం:
సంక్రాతిని పురస్కరించుకొని కనుమ పండుగ రోజు జనవరి 16 శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు నుండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ శివారు కడపాలెంలో డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో 16 సంవత్సరాల వయస్సు లోపు గల వారికి జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని,గ్రూపు మరియు సోలో విభాగంలో ఈ పోటీలు జరుగుతాయని గెలుపొందిన వారికి ప్రధమ,ద్వితీయ నగదు బహుమతులతో పాటు షీల్డ్ అందజేయడం జరుగుతుందని డాన్స్ పోటీలో పాల్గొనే ఆసక్తి కలవారు 9849720914, 9550356 821 ఫోన్ నెంబర్లో సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు మేరుగు బాపయ్య,రాజారావు,ఎరిపల్లి బాపునాయుడు తెలిపారు.