
జనం న్యూస్: జనవరి 14 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగగా సంక్రాంతి నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలియజేసారు. బంధు మిత్రులు అందరిని కలుసుకుని కనువిందులు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంటలు చేతికి వచ్చే కాలం అని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకుని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి, సంక్షేమంలో మార్కాపురం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషిచేద్దామని ఇంచార్జి జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. .