
జనం న్యూస్ ; 14 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సంక్రాంతి పండగ లో మొదటి రోజు అయినా భోగి పండుగను సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ వారి ఆధ్వర్యంలో 24 వ వార్డు సభ్యులందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు బి కే. భవాని మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తు సంక్రాంతి అంటేనే సిరిసంపదలకు గుర్తుగా చేసుకునే పండగ అని ,అందులో భోగి మంటలు వేయడం అంటే అగ్ని లో వేసే ప్రతి వస్తువు దాన్ని రూపాన్ని మార్చేస్తుంది భస్మం చేస్తుంది అలా మనం అందరం కూడా మనలో ఉన్న చెడుని, నెగటివ్ ని భస్మం చేసుకోవాలి అంటే అర్థం వాటిని వదిలేస్తే అందరం కూడా సుఖము, శాంతి, సంతోషాలతో గడపవచ్చు అని, అలాగే ప్రకృతి మనకి ఆహారము, ఆరోగ్యము, సిరి సంపదలనిచ్చే దేవతగా మనం ఆరాధిస్తామని అందుకే సంక్రాంతి అంటేనే ప్రకృతితో మమేకమై ఉండే పండగ గా, రైతన్నల కష్టం ఫలించే పండగ గా జరుపుకుంటామని మరియు మన సనాతన ధర్మ సంస్కృతిని - సాంప్రదాయాలని నిలబెట్టుకోవడంలో మనమందరము ముందుకు రావాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ భోగి మంటలకి పూజ చేసి నువ్వులు, ఆవాలు, నవధాన్యాలు, స్వయం లో ఉన్న చెడు ఆలోచనలనుఅన్నింటిని మంటల్లో వేస్తూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బికె స్వప్న డాక్టర్ శేషు కుమార్, డాక్టర్ ఉదయ్ కుమార్, ఓంకార్, వెంకటేశం, వంశీ, బిందు, శ్రీలత, సరిత, సునంద శిరీష తదితరులు పాల్గొన్నారు.