
జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కొత్తవలస రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యమైందని జి ఆర్ పి పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి శరీరంపై లేత నీలిరంగు రౌండ్ నెక్ టీ షర్ట్, ముదురు నీలం రంగు ప్యాంటు ఉందన్నారు. అతని ఎడమచేతిపై దేముడు అనే పచ్చబొట్టును గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.