
జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బిఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న బీకు నాయక్..పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో చేరిక…కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న..యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్ మరియు అతని ప్రధాన అనుచరుడు మాలోతు మంగయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నేడు తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బీకు నాయక్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడితే పార్టీలో ఉన్న రెడ్డిలు మరీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి మరియు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తనను అణగదొక్కాలని చూశారని గిరిజన బిడ్డనైన నన్ను అడుగడుగున అవమానిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మగౌరవం చంపుకోవడం ఇష్టంలేకనే ఆ పార్టీకి రాజీనామా చేసి మా కోసం,మా ఆత్మగౌరవం కాపాడడం కోసం పుట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకొని నేడు పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.రెడ్డి,వెలమల ఆధీనంలో ఉన్న పార్టీలలో మన బీసీ,ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగదని ఆ పార్టీల నుండి అందరు బయటకొచ్చి మన కోసం ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్,రాష్ట్ర నాయకులు కొమ్రిశెట్టి నర్సింహులు,రంగన్న పాల్గొన్నారు.