
జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని న్యావనంది గ్రామం లో సంత ప్రారంభించిన సర్పంచ్ దీప నరేందర్. మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు ఉపసర్పంచ్ న్యావనంది గ్రామ కమిటీ మరియు యువత అందరి సౌజన్యంతో సహకారంతో మార్కెట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇది ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందని గ్రామస్తులు తెలుపుతున్నారు గతంలో మార్కెట్ పోయి సరుకులు తీసుకొచ్చుకోవాలంటే భీంగల్ లేదా సిరికొండ మీద ఆధారపడవలసిన అవసరం ఉండేది ఇప్పుడు తమ ఊర్లోనే మార్కెట్ అవడం ఎంతో అభినందించదగిన విషయం అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఇది చుట్టుపక్కల గ్రామాలకు తండాలకు ఉపయోగకరమైనదని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామస్తులు పాల్గొని తమకు కావలసిన వస్తువులు కూరగాయలు కొనుగోలు చేసి వ్యాపారస్తులకు సహకరించగలరని గ్రామ కమిటీ వారు తెలిపారు.

