
జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారము భోగి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణాన్ని వేదమంత్రాల మధ్య వైభవంగా అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నిర్వహించినారు. అనంతరం కళ్యాణదాతలు అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి సరోజన దంపతులు శ్రీమత్స్యగిరి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు పట్టు వస్త్రాలను తలంబ్రాలను స్వామివారికి అందజేసినారు. అర్చకులు మొదట విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పూజ కన్యాదానం పూజ నిర్వహించి అంగరంగ వైభవంగా వేదమంత్రాలు మధ్య కళ్యాణం జరిపించారు. పెళ్లి కాని యువతి యువకులతో స్వామివారికి తలంబ్రాలను పోయించి తీర్థప్రసాదాలను అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిన్నా కృపాకర్ రెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….