
జనం న్యూస్:జనవరి 14(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం)
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం చేసిన చట్ట సవరణను మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ విడుదల చేసిన న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.