
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లె లోసంక్రాంతి సంబరాలు ప్రారంభమైన సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు విజయభాస్కర్ రెడ్డి ని వారి స్వగృహం చెన్నయ్యగారి పల్లె నందు కలిసి శాలువ తో వారీవురి నీ సన్మానిoచి శుభాకాంక్షలు తెలిపిన నందలూరు మండల మైనారిటీ సోదరులు, కులమతాలకు అతీతంగా సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలను తీసుకు రావాలని ఆకాంక్షి స్తున్నట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఏజీపీ షమీ ఉల్లా ఖాన్ నందలూరు మండల కో ఆప్షన్ సభ్యులు కరిముల్లా ఖాన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు షాజహాన్ యువ నాయకులు షారుఖ్, ఫహీం బీసీ నాయకులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు