
జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కప్–2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీలు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించబడుతున్నాయని తెలియజేస్తున్నాము.
గ్రామ పంచాయతీ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో సబ్-జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలతో పాటు పారా గేమ్స్ కూడా నిర్వహించబడును తెలిపారు. ఈ పోటీలు గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ క్రీడా పోటీలను నిర్వహించ బడునుతున్నాయి.క్రీడా పోటీల షెడ్యూల్:టార్చ్ ర్యాలీ : 08-01-2026 నుండి 17-01-2026 వరకు (10 రోజులు)గ్రామపంచాయతీ స్థాయి : 17-01-2026 నుండి 22-01-2026 వరకు (6 రోజులు) మండల (గ్రామీణ) / మున్సిపాలిటీ / కార్పొరేషన్ జోనల్ స్థాయి :28-01-2026 నుండి 31-01-2026 వరకు (4 రోజులు) నియోజకవర్గ స్థాయి : 03-02-2026 నుండి 05-02-2026 వరకు (3 రోజులు) జిల్లా స్థాయి : 09-02-2026 నుండి 12-02-2026 వరకు (4 రోజులు) రాష్ట్ర స్థాయి : 20-02-2026 నుండి 23-02-2026 వరకు (4 రోజులు) సిరికొండ మండలంలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీల్లో పాల్గొనాలని, గ్రామపంచాయతీలు మరియు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాము. ఎంపీడీఓ, సిరికొండ మండలం ఛైర్మన్ మండల కమిటీ