
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు చిన్నారులు
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవ పల్లె నందు సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి గురువారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. గ్రామంలోని పలు ప్రాంతాల నుండి మహిళలు చిన్నారులు యువతులు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని అందరినీ ఆకట్టుకునేలా వివిధ రకాల రంగవల్లులు వేశారు. రంగవల్లులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి అలాగే చిన్నారులకు యువతి యువకులకు మహిళలకు మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. ఇందులో కూడా ఉత్సాహంగా ఉల్లా సంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఈ ముగ్గులకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ శ్రీవాణి, ఎస్,టి,యు నాయకులు అల్లం అశోక్ కుమార్, ప్రొఫెసర్ శ్రీకళ, లక్ష్మీ నరసమ్మ లో నాయ్య నిర్ణయితలగా వ్యవహించారు. మహిళలు వేసిన ముగ్గులను తిలకించి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు కింద 5000,3000,2000 నగదు తో పాటు సంతూర్ వారు అందజేసిన ట్రావెల్ బ్యాగు, స్టీల్ టిఫిన్ క్యారియర్ సోపులు,లోషన్లు, అందజేశారు, మరో 8 మందికి కన్సిలేషన్ కింద వెయ్యి రూపాయలు నగదుతో పాటు బహుమతులను సంతూర్ గిఫ్ట్ లు అందజేశారు అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు స్టీల్ బేసిన్లు, వాటర్ బాటిల్లను, అందజేశారు అలాగే మ్యూజికల్ చైర్స్ లో గెలుపొందిన జూనియర్ సబ్ జూనియర్స్,యువతలు,మహిళలకు,విజిడం స్కూల్ అధినేత వల్లిమీ సుధాకర్ ప్రత్యేక బహు మతులను అందజేశారు, పై బహుమతులన్నీ న్యాయ నిర్ణీతలతో పాటు సర్పంచ్ జంబు సూర్యనారాయణ సయ్యద్ అమీర్ ఆర్ముగం విశ్వనాథ్, అల్లం అశోక్ కుమార్, తుమ్మది శివకుమార్, కానకుర్తి వెంకటయ్య,మెహర్ ఖాన్,మట్టిబాబు,హనుమంత్ పవన్ కుమార్, సుబ్బ నరసయ్య, షేక్ మౌలా, శివ నర్సింహులు, కిరణ్ చేతులు మీదుగా అందరికీ బహుమతులను అంద జేశారు.ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజలు ప్రముఖులు చిన్నారులు పాల్గొని విజయ వంతం చేసినందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు
