
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.