
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 16
ఎన్నుకున్న సర్పంచ్ గ్రామ అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో త్రాగునీటి పైపులైన్లు లీకై మురికి నీళ్లు త్రాగునీటిలో కలవడం వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామ వీధుల్లో నాలాలు లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల పెంపక కేంద్రాలుగా మారి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నారులు, వృద్ధులు జ్వరాలు, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు ఇచ్చిన సర్పంచ్ నేడు గ్రామ సమస్యలపై స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకైన పైపులైన్లు మరమ్మతులు చేసి, నాలాలు ఏర్పాటు చేసి, శుభ్రమైన త్రాగునీరు అందించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

