
విజేతలకు బహుమతుల ప్రధానం
జనం న్యూస్, జనవరి 17,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కడపాలెంలో కనుమ పండుగ సందర్బంగా డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.
క్లాసికల్,జానపద నృత్యాలు, సినిమా మరియు భక్తి గీతాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ స్థానాలతో పాటు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిగా నిర్వాహకులు మేరుగు శంకర్, బాపయ్య చేతుల మీదగా నగదును అందించారు.ఈ కార్యక్రమంలో మేరుగు రాజారావు,ఎరిపల్లి బాపునాయుడు,మల్లి రాంబాబు,నాట్య గురువు శివ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

