
జనం న్యూస్ జనవరి 17 జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహ ముత్తారం మండలకేంద్రానికి చెందిన పుట్టల విష్ణువర్ధన్ స్తంభంపల్లి పి పి గ్రామానికి చెందిన పసుల రామ్ అనే ఇద్దరు క్రీడాకారులు గత నెల 26నుండి 28 తేదీలలో ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు జాతీయ జట్టుకు సెలక్షన్ కావడం జరిగిందని మోడ్రన్ కబడ్డీ జిల్లా అధ్యక్షులు పసుల లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి పక్కల రాజబాబు ఒకప్రకటనలోతెలిపారు సెలక్షన్ అయినా క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని సింగరాయకొండ లో ఈనెల 15 నుండి 18 వరకు జరగబోయే జాతీయస్థాయిలో పాల్గొంటారు ఇట్టి సెలక్షన్స్ కి సహకరించిన మోడ్రన్స్ కబడ్డీ ఫౌండర్ కుoబం రామ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి గారికి కరీంనగర్ సెక్రటరీ అంజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు